ఎండలు తీక్షణంగా ఉన్నాయి. అయినా లెక్కచేయటం లేదు.దాదాపుగా మూడు గంటలపాటు నిల్చొనే ఉన్నారు. అయినా లెక్కపెట్టడం లేదు. రోడ్డుమీదే నిలబడి ఉన్నారు. ఇవేమీ లెక్కచేయటం లేదు. ముఖంలో మాత్రం చక్కటి చిరునవ్వులతో ఆప్యాయతలు చిందిస్తూ ఉన్నారు. ఇంతటి ఆప్యాయత, ప్రేమానురాగాలు చూపుతున్న ప్రతి ఒక్కరికీ చేతులు జోడించి, శిరసు వంచి నమస్కరిస్తున్నా
నంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహాధర్నాకు వచ్చిన ప్రజానీకాన్ని పలకరించారు.ముఖ్యమంత్రి కావాలనే ఆశతో చంద్రబాబు అబద్ధపు వాగ్దానాలు ఇచ్చారని వైఎస్ జగన్ విమర్శించారు. ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చిన ఆయన ...ప్రజలతో ఇంకా పనేముందనుకొని...మాట మార్చారన్నారు. ప్రపంచానికి ట్యూషన్లు చెప్పిన అనుభవం ఉందని టీవీల్లో ఊదరగొట్టిన చంద్రబాబు... హామీల అమల్లో రిక్తహస్తం చూపారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని బాబు తుంగలో తొక్కారని వైఎస్ జగన్ మండిపడ్డారు.
No comments:
Post a Comment