Thursday 10 October 2013

జగన్ దీక్షభగ్నం..

వైయస్ జగన్ చేస్తున్న నిరాహార‌దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఐదు రోజులుగా దీక్ష చేస్తున్న ఆయన్ని పోలీసులు బలవంతంగా నిమ్స్‌కి తరలించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ జగన్ చేపట్టిన దీక్ష బుధవారం ఐదో రోజుకు చేరింది. నిమ్స్ ఆస్పత్రిలో వైద్యులు ఆయనకు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు. రాత్రి పది గంటల ప్రాంతంలో పోలీసులు భారీ సంఖ్యలో దీక్షా శిబిరానికి చేరుకున్నారు. జగన్‌ను తరలించడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. చివరకు దీక్షా శిబిరం నుంచి వైయస్ జగన్‌ను తరలించారు.

Monday 23 September 2013

జగన్ అన్నను ను చూసేందుకు తరలివస్తున్న అభిమానులు

దహారు నెలల తర్వాత జననేత జగన్‌మోహన్‌ రెడ్డి జైలు నుంచి విడుదలయ్యే క్షణం కోసం రాష్ట్ర ప్రజానీకం యావత్తూ ఎదురుచూస్తోంది. ఆయన రాకను స్వయంగా చూసేందుకు... ఆ ఆనంద క్షణాలను జగన్‌ సమక్షంలోనే ఆస్వాదించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులు హైదరాబాద్‌ చేరుకుంటున్నారు. రాత్రి కడప నుంచి ప్రత్యేక బస్సులో అభిమానులు హైదరాబాద్‌ బయల్దేరారు.

జననేతను స్వయంగా చూసి ఆయనకు శుభాకాంక్షలు చెప్పేందుకు తాము రాజధానికి వస్తున్నామని అభిమానులు చెబుతున్నారు. ఇక  జగన్‌ మోహన్‌ రెడ్డి విడుదల సందర్భంగా చంచల్‌గూడ జైలు పరిసరాల్లో సందడి వాతావరణం కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలిరానున్న నేపథ్యంలో  పోలీసులు చంచల్‌గూడ పరిసరాల్లో బందోబస్తు పెంచారు. బలగాల సంఖ్య పెంచారు.  అలాగే రోడ్డుపై ముళ్ల కంచె పరిచారు.  ఈరోజు మధ్యాహ్నం జగన్ జైలు నుంచి విడుదల కానున్నారు.




జగన్ బెయిల్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పార్టీ నాయకులు, అభిమానులు

జగన్ బెయిల్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పార్టీ నాయకులు, అభిమానులు



 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్ సభ సభ్యుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై మరి కాసేపట్లో తీర్పురానుండటంతో వై.ఎస్. భారతి, వై.ఎస్.వివేకానంద రెడ్డి నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. జగన్ బెయిల్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. బెయిల్‌ పిటిషన్‌పై ఈనెల 18న ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం తీర్పు సోమవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే.


 జగన్ ఆస్తుల కేసులో విచారణ పూర్తయిందని సిబిఐ కోర్టుకు తెలిపింది . హైకోర్టు ఆదేశించిన అన్ని అంశాలపై దర్యాప్తు పూర్తి చేశామని నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన మెమోలో వివరించింది. క్విడ్‌ప్రోకో కేసులో 8 కంపెనీలకు సంబంధించి ఆధారాలు లభించలేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి చిక్కుముడులు వీడుతున్నాయి. పదింట ఎనిమిది కేసుల్లో ఎలాంటి క్విడ్‌ప్రోకో జరగలేదని దర్యాప్తు సంస్థ నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు మెమో రూపంలో వెల్లడించింది.

Sunday 22 September 2013

చంద్రబాబు రాజకీయమంటే???


లుకల కళాశాలకు పిల్లిని ప్రిన్సిపాల్‌గా నియమించడం

నీతిచంద్రిక పుస్తకాన్ని నక్క రాయడం
కప్పల సమూహానికి పాముతో ఉపదేశాలు వినిపించడం
భవిష్యత్తు అద్భుతమని... బలికి వెళ్లే గొర్రెని నమ్మించడం

  • హింస మానాలని సింహం సత్యాగ్రహం చేయడం
నిజాయితీ గురించి తోడేలు తొడగొట్టడం
రుద్రాక్ష మాలల్ని పులి అమ్మడం

Monday 16 September 2013

సోనియా ముందు మోకరిల్లండి

చంద్రబాబు నాయుడు ఢిల్లీ ఎందుకు వెళుతున్నారో స్పష్టం చేయాలని వైకాపా నాయకురాలు షర్మిల డిమాండ్ చేశారు. ఆమె చేపట్టిన సమైక్య శంఖారావం బస్సు యాత్ర లో బాగంగా విశాఖ నగరంలోని జగదాంబ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. సోనియా గాంధీకి ముఖ్యమంత్రి కిరణ్, పిసిసి అధ్యక్షుడు బొత్స ఎలా విధేయులో చంద్రబాబు నాయుడు తన విధేయతను ఆమె ముందు ప్రదర్శించేందుకు వెళుతున్నారని అన్నారు. తన ఎమ్మెల్యేలు, ఎంపిలతో అబల ప్రదర్శన చేసి, తనపై ఏ కేసులు లేకుండా చూడాలని వేడుకోడానికి వెళుతున్నారని షర్మిల అన్నారు. రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి రాదు. చంద్రబాబుకు రాష్ట్రంలో ఏ పదవీ దక్కే అవకాశం లేదు. ఆపార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేస్తే, కనీసం కేంద్ర మంత్రి పదవైనా ఆయనకు దక్కుతుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు రెండు నాల్కుల ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆయన సమైక్య నినాదాన్ని వినిపిస్తేనే సీమాంధ్రలో తిరిగేలా చేయాలని, లేకుంటే ఆయన్ను తరిమికొట్టాలని షర్మిల పిలుపునిచ్చారు.